హస్తినకు చేరుకున్న కేసీఆర్‌

2

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సాయంత్రం బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. నేడు ఉదయం ప్రధాని నరేంద్రమోడీని కలువనున్నారు. అనంతరం నలుగురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీకానున్నారు. సీఎంతోపాటు పార్టీ ఎంపీలు కే.కేశవరావు, వినోద్‌ ఢిల్లీ వెళ్ళారు. ఈ సందర్భంగా కేంద్రం పెద్దలతో తెలంగాణలోని సమస్యలను ప్రస్తావించే అవకాశం ఉంది.