కొత్త జిల్లాలపై కేసీఆర్‌ కసరత్తు

3

బడ్జెట్‌ ప్రతిపాదనలపై అధికారులతో సమీక్ష

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : కొత్త జిల్లాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణలో వీలైనంత త్వరగా జిల్లాల పునర్విభజన జరగాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. జిల్లాల పునర్విభజనపై ప్రాథమిక కసరత్తు పూర్తిచేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. 10 జిల్లాలతోపాటు కొత్తగా 14జిల్లాలు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. బ్జడెట్‌ ప్రతిపాదనలు, ఢిల్లీలో కేంద్రం ముందుంచాల్సిన అంశాలపై ఈ సందర్భంగా సవిూక్షించారు.సచివాలయంలో బడ్జెట్‌ కేటాయింపులపై టాస్క్‌ఫోర్స్‌ కమిటీల కసరత్తు కొనసాగుతోంది. బడ్జెట్‌ కేటాయింపుల నివేదిక మరో 5రోజులు ఆలస్యం కానుంది. కర్నాటక, గుజరాత్‌, రాజస్థాన్‌ బడ్జెట్లను కమిటీలు అధ్యయనం చేస్తున్నాయి. బడ్జెట్‌ కేటాయింపులే కాదు.. నిధుల ఖర్చు, అభివృద్ధి ఫలాలపై మానిటరింగ్‌ కమిటీ వేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.