రాజకీయాల కోసం కాదు.. అభివృద్ధి కోసమే
తుమ్మల తెరాసలో చేరిండు : కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (జనంసాక్షి) : తెలంగాణ అభివృద్ధి కోసమే తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరాడని, రాజకీయాల కోసం కాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ రాజకీయాలు చేయదని, అభివృద్ధే తమ ఎజెండా చెప్పారు. అభివృద్ధి ఎజెండాతో మాత్రమే ముందుకు వెళ్తున్నామని తేల్చిచెప్పారు. అనేక సహజ వనరులతో అలరారుతున్న ఖమ్మం జిల్లాను తెలంగాణలో అగ్రగామిగా నిలబెడుతామని చెప్పారు. జిల్లాలో నాణ్యమైన ఇనుప ఖనిజం పుష్కలంగా ఉందన్నారు. బయ్యారంలో త్వరలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుచేస్తామని తెలిపారు. భవిష్యత్‌లో ఖమ్మం జిల్లా మంచి అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లా నాయకులు తుమ్మల తదితరులు టిఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా వారినిపార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఖమ్మం అభివృద్దికి అన్యాయం జరిగిందన్నారు. దానిని సవరించుకుని ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. కృష్ణాజలాలు ఖమ్మం మొత్తం పొలాలను తడిపేలా ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. అలాగే విస్తీర్ణంలో పెద్దదిగా ఉన్న ఖమ్మంలో మరో జిల్లా ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. త్వరలోనే కొత్తగూడెం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. విూ అందరి అభిమానాన్ని మూటకట్టుకుని బంగారు తెలంగాణ కోసం కృషిచేస్తానని సీఎం కేసీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు. తుమ్మల అనుచరులందరికీ స్వాగతం పలుకుతూ ఖమ్మం నుంచి తుమ్మల పార్టీలో చేరుతారంటే సభ ఏ నిజాం కళాశాలో పెట్టేదన్నారు. ఈ జనాన్ని చూస్తుంటే ఉత్సాహం వస్తుందని, అందరికీ పేరుపేరున స్వాగతం తెలియజేస్తున్నానన్నారు. తుమ్మల నాకు ఆప్తమిత్రుడు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసమే తుమ్మల పార్టీలో చేరారు. తెలంగాణ సంధి సమయంలో ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు. వందేళ్ల నుంచి తెలంగాణ అనేక పోరాటాలు చేశాం. వంద ఏళ్లుగా తెలంగాణ కన్నీరు పెట్టింది. తెలంగాణ ప్రజలు అనేక ఉద్యమాలు, బలిదానాలు చేశారు. తెలంగాణ చాన్నాళ్ల పాటు వలసవాదుల ఇనుపకాళ్ల కింది నలిగిపోయింది. ఈ దఫా యావత్ తెలంగాణ ఏకమై కొట్లాడింది. తెలంగాణ సాధించామన్నారు. ఇప్పుడు కావాల్సింది అభివృద్ది తప్ప మరోటి కాదన్నారు. 1982లో ఇద్దరం ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు తుమ్మలతో సత్సబంధాలు ఉన్నాయి. తెలంగాణలో ఖమ్మం జిల్లాను అగ్రగామిగా నిలబెడుదాం. ఖమ్మం జిల్లా తెలంగాణకే తలమానికం. జిల్లాలో అనేక వనరులు ఉన్నాయి. కొత్తగూడెం కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేస్తామని అన్నారు. తుమ్మలతో పాటు తెరాసలో చేరిన వారందిరీకీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ స్వాగతం పలికారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తుమ్మల నాగేశ్వరరావు తనకు ఆప్త మిత్రుడని తెలిపారు. ఎన్నికల ముందు కూడా తాము వివిధ అంశాలపై చర్చించుకునే వారిమని వెల్లడించారు. మచ్చలేని నేత తుమ్మలని కొనియాడారు. ఆయనకు ఖమ్మం అణువణువూ తెలుసన్నారు. అభివృద్దికి పాటుపడే శక్తి కూడా ఉందన్నారు. ప్రస్తుతం తెలంగాణ సంధి దశలో ఉందని చెప్పారు. తెలంగాణ చాన్నాళ్లపాటు వలసవాదుల ఇనుప సంకెళ్ల కింద నలిగిందన్నారు. ఖమ్మం జిల్లా తెలంగాణకే తలమానికమని చెప్పారు. ఖమ్మం అభివృద్దికి అందరూ పాతాకొత్త అన్న భేదం లేకుండా కలసి పోవాలన్నారు. జిల్లాను అద్భుతంగా అభివృద్దిచేసేందుకు ప్రతి ఒక్కరూ కలసి రావాలన్నారు.
కేసీఆర్ లక్ష్యసాధనలో భాగస్వామి కావాలనే.. : తుమ్మల
తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణను సాధించారని ఖమ్మం జిల్లా నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తన చిరకాల మిత్రుడని చెప్పారు. కేసీఆర్ లక్ష్యసాధనలో భాగస్వామి కావాలనే తెరాసలోకి వచ్చానని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో పలు మార్పులకు తాను, కేసీఆర్ కారణమన్నారు. తెలంగాణను కోటి రతనాల వీణగా మార్చాలన్నారు. రాష్టాన్న్రి గుజరాత్ కంటే ఎక్కువ అభివృద్ధి చేయగల సమర్థతే కేసీఆర్‌కే ఉందన్నారు. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు తననెంతగానో బాధించాయని చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు ఖమ్మం జిల్లా నేతలు, జడ్పీటీసీలు తదితరులు తెరాసలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ సాధ్యమని తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. నా వెంట వచ్చిన కార్యకర్తలకు పాదాభివందనం. రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన అనేక మార్పులకు నేను, కేసీఆరే కారణం. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ సాధ్యం. భారతదేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెడుదామని కేసీఆర్ నన్ను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. తెలంగాణ పునర్‌నిర్మాణంలో భాగస్వామినై కేసీఆర్‌కు తోడ్పాటుగా ఉంటాను. కేసీఆర్.. ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ సాధించారు. కేసీఆర్ నా చిరకాల మిత్రుడు. కేందప్రభుత్వం ఆదరాబాదరాగా పోలవరం ఆర్డినెన్స్ తెచ్చింది. ముంపు మండలల ప్రజలంతా కేసీఆర్ గుండెల్లో ఉన్నారు. లాఠీ దెబ్బతగలనీయకుండా కేసీఆర్ ప్రజల ఆకాంక్ష నెరవేర్చారు. ప్రాజెక్టు కట్టుకోండి ముంపు మండలాలను మాకు వదిలేయండి అంటే వినలేదు. ముంపు మండలాల ప్రజల ఉసురు తగులుతుందని అన్నారు. ఖమ్మం జిల్లాను అగ్రగామిగా నిలబెడుతానన్నారు. టీడీపీలో ఉండి ఆత్మాభిమానాన్ని చంపుకోలేకపోయామని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తెలిపారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరిక సందర్భంగా బాలసాని ప్రసంగించారు. చంద్రబాబుది నియంత పాలన ధ్వజమెత్తారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ వెంట ఖమ్మం జిల్లా నేతలమంతా ఉంటామని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోనే రాష్టాభ్రివృద్ధి సాధ్యమని అనేకమంది నమ్ముతున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఖమ్మం నేత తుమ్మల నాగేశ్వరరావు ఆయన అనుచరులు తెరాసలో చేరుతున్న సందర్భంగా నిర్వహించిన భారీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా తుమ్మల, ఆయన అనుచరులను మంత్రి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ సిఎం మహ్మూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.