బలంలేని భాజపాకు అధికారమెందుకు? : కేజ్రివాల్‌

2
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) :

బలంలేని భారతీయ జనతాపార్టీకి అధికారమెందుకు అని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రశ్నించారు. దేశరాజధాని న్యూఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు బిజెపి ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన నిరసన వ్యక్తంచేశారు. దొడ్డిదారిన అధికారంలోకి రావాలని చూస్తోందని ఆరోపించారు. అసెంబ్లీలో బలం లేకున్నా అధికారం కోసం అర్రులు చాస్తోందన్నారు. శనివారం నాడు భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని రాష్ట్రపతి భవన్‌లో కలిశారు.  విషయంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. మైనార్టీలో ఉన్న భాజపాను ప్రభుత్వ ఏర్పాటుకు  ఎట్టిపరిస్థితుల్లోనూ గవర్నర్‌ ఆహ్వానించరాదని ఆయన రాష్ట్రపతిని కోరారు. బలం లేకుండా ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొని ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేయాలని చూస్తోందని కేజీవ్రాల్‌ ఆరోపించారు. దీనిని ప్రతిఘటించాలన్నారు. ఢిల్లీలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రజాప్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తే

మహాఉద్యమం తప్పదని ఆమ్‌ఆద్మీచీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఆమ్‌ఆద్మీ ప్రతినిధి బృందానికి రాజ్యాంగ బద్దంగానే వ్యావహరిస్తామని రాష్ట్రపతి హమీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు.