జమ్మూను ముంచెత్తిన వరదలు
జమ్మూ, సెప్టెంబర్ 6 (జనంసాక్షి) :
జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఇప్పటికి మృతిచెందిన వారి సంఖ్య 120కి చేరింది. మరో 11వేల మందిని సైన్యం రక్షించింది. గడిచిన 60ఏళ్ళలో ఇలాంటి పరిస్థితి సంభవించడం ఇదే మొదటిసారి. మరోవైపు రాష్ట్రంలో పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు గమనిస్తోంది. ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శనివారం జమ్మూలో పర్యటించారు. వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అంతకుముందు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో సమావేశమై పరిస్థితిని సవిూక్షించారు. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించింది. ఇదిలా ఉంటే, భారీ వర్షాల వల్ల సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వరద ఉద్ధృతికి తొమ్మిది జవాన్లు గల్లంతయ్యారు. సహాయక చర్యలకు వెళ్లి గల్లంతైన జవాన్లను ఎట్టకేలకు భద్రతా బలగాలు రక్షించాయి. మరోవైపు భారత సైన్యం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తోంది. గత ఐదు రోజులుగా జమ్మూకాశ్మీర్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో వరద ఉద్ధృతి పెరిగి ప్రజలు గల్లంతయ్యారు. వేల మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టినా.. ప్రతికూల వాతావరణం ఆటంకంగా మారింది. అవకాశమున్న చోట బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు, వదర ఉద్ధృతికి తావి నదిపై నిర్మించిన ఓ వంతెన కొట్టుకుపోయింది. గత దశాబ్ద కాలంలో జమ్మూ కాశ్మీర్‌ను ఇంతటి వరదలు సంభవించలేదని ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. వరద పరిస్థితిని సవిూక్షించిన రాజ్‌నాథ్.. అనంతరం విూడియాతో మాట్లాడారు. నిరాశ్రయులైన ప్రజలకు అండగా ఉంటామన్నారు. సంక్షోభ సమయాల్లో కేంద్రం రాష్ట్రానికి చేయూతనిస్తుందని చెప్పారు. జమ్ము-కాశ్మీర్‌లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలుతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కంభీర, చీలం నదులు పొంగిపోర్లడంతో వరదలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో వరద ఉధృతిపై పరిస్థితి విషమించడంతో కేంద్రం సైన్యాన్ని రంగంలోకి దించింది. పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. దాంతో పాటు వరద ఉధృతి ఉన్న ప్రదేశాల నుండి అక్కడిప్రజలను, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టింది. అయితే రాష్ట్రంలో వరద దుస్థితిపై కేంద్రం దృష్టిసారించింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో వరద ఉధృతిని జాతీయ విపత్తు నివారణ సంస్థ ద్వారా కేంద్రం పర్యవేక్షిస్తోంది. కాగా, రెండు, మూడు రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగడంతో రాష్ట్రంతోపాటు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టేందకు రంగంలోకి దిగింది.