వానా వానా వల్లప్పా..!

4
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

ఉప్పొంగుతున్న వాగులు.. పరవళ్లు తొక్కుతున్న కృష్ణా, గోదావరి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) :

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంవల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  భద్రాచలం గోదావరి నది వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా, గోదావరి నదులు పరవళ్ళు తొక్కుతున్నాయి. నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలు, పంటపొలాలు నీటమునిగాయి. ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరగడంతో అవి నిండుకుండను తలపిస్తున్నాయి. గత పదిహేను రోజుల కింద వర్షాలు పడక పంటలు ఎండిపోయి రైతులు