జాతీయ విపత్తుగా ‘జమ్మూ’ వరదలు

55A

రూ.వెయ్యి కోట్ల కేంద్ర సహాయం

ప్రధాని ఏరియల్‌ సర్వే

120కి చేరిన మృతుల సంఖ్య

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) :

జమ్మూకాశ్మీర్‌లో వరదలను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రక టించింది. రూ.వెయ్యి కోట్ల ఆర్థిక సహాయానికి అంగీకరిం చింది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ఏరియల్‌ సర్వే నిర్వహించి పరిస్థితులను తెలుసుకున్నారు. గత మూడు రోజు లుగా జమ్మూ-కాశ్మీర్‌లో కురుస్తున్న వర్షాలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. దీనివల్ల వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. అనేక గ్రామాలు జలమయం కావడం తో పంటలు కూడా నీటమునిగాయి. జమ్మూ-కాశ్మీర్‌ రాజ ధాని అయిన శ్రీనగర్‌ జలదిగ్బంధంలో చిక్కుకుంది. అక్కడ సమాచార వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా మొబైల్‌ సేవలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడడంతో జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిని మూసివే శారు. జమ్మూ-కత్రా-ఉదమ్‌పూర్‌ మార్గంలో రైళ్ళ రాకపోక లకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్ళను స్టేషన్‌లోనే నిలిపివేశారు. వరదల మూలంగా ఇప్పటివరకు 120మంది చనిపోయారని అధికారులు చెప్పారు. జమ్మూ-కాశ్మీర్‌లో జరి గిన ఈ విపత్తును ప్రధాని నరేంద్రమోడీ ఏరియల్‌ సర్వే ద్వారా సమీక్షించారు. ఇక్కడ పరిస్థితిని చూసి ప్రధాని చలించిపో యారు. ముంపు ప్రాంతాలను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించిన ప్రధాని దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితులను రక్షించేందుకు కేంద్రం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. వాయుసేన ద్వారా కూడా సహాయక చర్యలు చేపట్టాలని ప్రధాని అన్నారు. మందులు, ఆహార పదార్థాలు, నిత్యావసర పరికరాలు కేంద్రం నుండి పంపించాలని చెప్పారు. సహాయక చర్యల కోసం ఢిల్లీ నుండి ఇరవై పడవలు పంపించే ఏర్పాట్లుచేస్తున్నామని అన్నారు. జమ్మూకు చేరుకున్న ప్రధాని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓమర్‌అబ్దుల్లాతో సమావేశమ య్యారు. వరదలకు సంబంధించి పరిస్థితిని అడిగి తెలుసుకు న్నారు. అక్కడున్న అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిం చిన మోడీ ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని, ఖర్చుకు వెనకాడవద్దని అధికారులను ఆదేశించారు. వరదల వల్ల ప్రజలు అధైర్యపడవద్దని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని మోడీ ప్రజలకు భరోసా ఇచ్చారు.