జగన్‌పై మరో ఛార్జిషీట్‌

1

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (జనంసాక్షి) :

జగన్‌ అక్రమాస్తుల కేసులో మరో ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టుకు దాఖలుచేసింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో ఈ ఛార్జిషీట్‌ పదకొండవది. ఇందూ గృహ నిర్మాణ ప్రాజెక్టులపై ఛార్జిషీట్‌ దాఖలైంది. వైఎస్‌ హయాంలో ఇందూకు 4 గృహ నిర్మాణ ప్రాజెక్టులు కేటాయించారు. కూకట్‌పల్లి, నాగోల్‌, నంద్యాల, గచ్చిబౌలిలో ఇందూకు గృహ నిర్మాణ ప్రాజెక్టులు కేటాయించినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఇందూ గృహనిర్మాణ ప్రాజెక్టులపై దాఖలు చేసిన ఈ ఛార్జిషీటులో నిందితులుగా జగన్‌, విజయసాయి, శ్యాంప్రసాద్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితర 14మంది పేర్లు పేర్కొన్నారు.వైఎస్‌ హయాంలో ఇందు సంస్థకు కూకట్‌పల్లి, నాగోలు, గచ్చిబౌలి, నంద్యాలలో 4 గృహనిర్మాణ ప్రాజెక్టులు కేటాయించారు. ఈ ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయని సీబీఐ నిర్దారించింది. జగన్‌ సంస్థల్లో ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి రూ.70కోట్లు పెట్టుబడి పెట్టారు. తక్కువ ధరకు ఇందు సంస్థకు భూములు కేటాయించారని, అందుకు ప్రతిఫలంగా జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఛార్జిషీట్‌లో పేర్కొన్న నిందితుల పేర్లు ఇలావున్నాయి ఏ1 జగన్‌, ఏ2 విజయసాయిరెడ్డి, ఏ3 మహంతి, ఏ4 శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, ఏ5 ఇందూ ప్రాజెక్టు, ఏ6 వైవీ సుబ్బారెడ్డి, ఏ7 వీవీ కృష్ణప్రసాద్‌, ఏ8 చిడ్కో ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఏ9 వసంత ప్రాజెక్టు .ఇదిలావుంటే  వైకాపా అధ్యక్షుడు జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాంపల్లిలోని సీబీఐ కోర్టు వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.