ఏడు కొత్త జిల్లాలు

3

సర్కారు కసరత్తు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) :

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. తొలి విడతా ఏడుడ కొత్త జిల్లాలు ఏర్పాటు చేయా లని యోచిస్తున్న ప్రభుత్వం దీనిపై ప్రతి పాదనలు పంపా లని భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌కు ఆద ేశాలు జారీచేసింది. మొదటి దశలో ఆదిలాబాద్‌ జిల్లాలోని మంచిర్యాల, కరీంనగర్‌ జిల్లాలోని జగిత్యాల, మెదక్‌ జిల్లాలోని సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్‌, నల్గొండ జిల్లాలోని సూర్యాపేట, ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌ను జిల్లాలుగా ఏర్పాటుచేయనుంది. తెలంగాణలో 23 జిల్లాలను ఏర్పాటుచేయాలని గతంలోనే కేసీఆర్‌ ప్రకటించారు. అందులో భాగంగానే ప్రక్రియను వేగవంతం చేశారు.