కాశ్మీర్‌కు రూ.వెయ్యికోట్ల వరద సాయం

2

కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) :

వరదలతో తీవ్రంగా నష్టపోయిన జమ్మూకాశ్మీర్‌కు రూ.వెయ్యికోట్ల వరద సాయాన్ని కేంద్ర ¬ం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రకటించారు. వరద బాధితులను రక్షించడంలో భారత సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్‌ కీలకపాత్ర పోషించిందని చెప్పారు. జమ్మూకాశ్మీర్‌లో ఇప్పటివరకు 1.30 లక్షల మందిని సైన్యం రక్షించిందని చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలో రాజ్‌నాథ్‌ విూడియాతో మాట్లాడారు. జమ్మూకాశ్మీర్‌ను అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు. కాశ్మీర్‌లో పరిస్థితిని  కేంద్ర ¬ంశాఖ కార్యదర్శి పర్యవేక్షిస్తున్నారని వివరించారు. కాశ్మీర్‌లో వరద సాయం, పునరావాసానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఆల్‌ఖైదా విభాగం ఏర్పాటుపై భయపడాల్సిందేవిూ లేదని చెప్పారు. ఆల్‌ఖైదా సీడీనీ నిఘా పరిశీలిస్తున్నాయన్నారు. పోలీసు నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్టాల్రకు సూచించామని చెప్పారు. తమ ప్రభుత్వం మాటల్లో, చేతల్లో తేడాలేదని తెలిపారు. కాశ్మీర్‌కు వరదలు పోటెత్తిన వెంటనే స్పందించామన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా అక్కడ స్వయంగా పర్యటించి పరిస్థితిని సవిూక్షించారని చెప్పారు. తక్షణమే సహాయక చర్యలకు ఆదేశించారని, కాశ్మీర్‌ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించారని చెప్పారు. వరదలు వచ్చిన వెంటనే కేంద్రం స్పందించి సైన్యాన్ని రంగంలోకి దింపామన్నారు. ఈశాన్య రాష్టాల్ల్రో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేసేందుకు పటిష్ట ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియాపై ఉన్న నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు రాజ్‌నాథ్‌ తెలిపారు.

లవ్‌ జిహాద్‌ అంటే ఏమిటి?

లవ్‌ జిహాద్‌ అంటే ఏమిటని ¬ంమంత్రి ప్రశ్నించారు. విూడియా సమావేశంలో పలువురు విలేకరులు లవ్‌ జిహాద్‌ గురించి ప్రశ్నించగా రాజ్‌నాథ్‌ పైవిధంగా స్పందించారు. దానర్థం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రేమ వివాహాల పేరుతో మత మార్పిళ్లు జరుగుతుండడంపై బీజేపీ ఎంపీ యోగీ ఆదిత్యనాథ్‌ తొలిసారిగా ఈ పదాన్ని ప్రయోగించి, ప్రచారంలోకి తీసుకువచ్చారు. దీనిపై కొంత కాలంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విలేకరులు లవ్‌ జిహాద్‌పై ప్రశ్నించగా.. అంటే ఏమిటని రాజ్‌నాథ్‌ ఎదురు ప్రశ్నించారు.