ఉమ్మడి సంస్థలను విభజిద్దాం

3

గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) :

ఉమ్మడి సంస్థలను విబ óజిద్దామని తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు గవర్నర్‌ నరసింహన్‌ దృష్టికి తెచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో రాజభవన్‌కు వెళ్లిన కేసీఆర్‌ దాదాపు మూడు గంటల పాటు గవర్నర్‌తో వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ఉమ్మడి సంస్థల విభజనపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సహా తొమ్మిది, పదో షెడ్యూల్‌లో ఉన్న సంస్థల విభజనపై ముఖ్యమంత్రి నరసింహన్‌ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉమ్మడి సంస్థల గురించి పేర్కొన్నారు. ఆయా సంస్థల విభజనపై తెలంగాణ ప్రభుత్వం కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఉన్నత విద్యామండలి, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వంటి వాటి విభజన పూర్తిచేసింది. మిగతా వాటిపైనా దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో మిగిలిన సంస్థల విభజన పూర్తి చేసి, తెలంగాణ రాష్టా  న్రికి కొత్తవి ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని కేసీఆర్‌ గవర్నర్‌ను కోరినట్లు సమాచారం. అలాగే, అసెంబ్లీ బడ్జెట్‌ సమా వేశాలు, అధికారుల పంపిణీ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు వంటి వాటిపైనా ముఖ్యమంత్రి గవర్నర్‌తో చర్చించినట్లు తెలిసింది. అలాగే విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల ఏర్పాటుపై నిర్ణయం తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, శాంతి భద్రత పరిరక్షణ, ప్రభుత్వ పథకాల అమలు, రైతుల రుణమాఫీ, విద్యుత్‌ సమస్య, విద్యార్థులఫీజు రీయింబర్స్‌మెంట్‌, వినాయకచవితి నవరాత్రోత్సవాల విజయవంతం మొదలైన అంశాలకు ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.