ఉత్తరాఖండ్‌లో ఘోరం
లోయలోపడ్డ బస్సు 16 మంది మృతి
డెహ్రాడూన్, సెప్టెంబర్ 13 (జనంసాక్షి) :
ఉత్తరాఖండ్‌లో శనివారం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. తెహ్రీ జిల్లాలో జయల్‌గఢ్‌కు సవిూపంలో వం తెనపై నుంచి బస్సు లోయలో పడి 16మంది ప్రయాణికులు మృతిచెందారు. 17మంది గాయపడ్డారు. ప్రమాద సమయం లో బస్సులో 33మంది ఉన్నారు. బస్సు హరిద్వార్ నుంచి కర్ణప్రయాగ్ వెళుతోంది. మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేయ డానికి బస్సు డ్రైవర్ ప్రయత్నిస్తుండగా ప్రమాదం చోటుచేసు కున్నట్లు సమాచారం. వెంటనే సమాచారం అందుకున్న పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.సహాయక చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు చేర్చారు.