కాంగ్రెస్ విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు
కేసీఆర్‌ను విమర్శించే స్థాయి పొన్నాలకు లేదు : రాజయ్య
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (జనంసాక్షి) :
కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని డిప్యూటీ సీఎం రాజయ్య ఆరోపించారు. కేస ీఆర్‌ను విమర్శించే స్థాయి పొన్నాల లక్ష్మయ్యకు లేదని హితవు పలికారు. శనివారం టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో రాజయ్య విూడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీల పాలనలో తెలంగాణ వివక్షకు గురైం దని, అన్ని రంగాల్లోనూ అన్యాయమే జరిగిం దని డిప్యూటీ సీఎం రాజయ్య మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయాన్ని, రైతు లను పట్టించుకోలేదని, ఇప్పుడేమో తామే రైతుల బంధువులమని ఆందోళనలకు దిగుతు న్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ రైతుపక్షపాతి అని అన్నారు. అందుకే రైతుల రుణాలు మాఫీ చేస్తున్నారని, ఐదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేశారని చెప్పారు. టీడీపీ పాలనలో వ్యవసాయం దండగ అన్నారని, ఇప్పుడు వారు రైతుల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రెండు నెలల్లో నష్టపరిహారం విడుదల చేశారన్నారు. రైతుబిడ్డగా రైతు సమస్యలు తెలిసినందునే కేసీఆర్ రుణమాఫీ పథకాన్ని ప్రకటించారని చెప్పారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఐదేళ్ల పంట నష్టానికి సంబంధించిన రూ.480 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేశారని చెప్పారు. దీనివల్ల 12.08లక్షల మందికి లబ్ధి చేకూరనుందన్నారు. వ్యవసాయ ఆధారిత రంగాలను ప్రోత్సహిస్తున్నారని, ట్రాక్టర్ ట్రాలీలు, ఆటోలపై పన్ను రద్దు చేయడమే కాకుండా గత బకాయిలను రద్దుచేశామని చెప్పారు. రైతులపై ప్రేమ ఒలకబోస్తున్న టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపై రాజయ్య మండిపడ్డారు. పొన్నాల నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి తెలంగాణకు ఏవిూ చేయలేదని మండిపడ్డారు. వలస పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల విూద పూర్తి నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల, కంతనపల్లి ప్రాజెక్టుల గురించి పట్టించుకోకుండా పులిచింతల, పోలవరం ప్రాజెక్టులపైనే దృష్టిసారించారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఆ పాపమే కాంగ్రెస్ పార్టీకి తగిలి మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిందన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఒక భరోసా వచ్చిందన్నారు. కేసీఆర్ వల్లే బంగారు తెలంగాణ సాధ్యమని నమ్మారని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై అందరూ దృష్టిసారిస్తున్నారని తెలిపారు. సమగ్ర సర్వే, మన ఊరు-మన ప్రణాళిక వంటి వాటిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఆరా తీస్తున్నారని తెలిపారు. ఏ విధంగా వీటిని అమలు చేస్తున్నారని, సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరక తీసుకుపోతున్నాడని తెలుసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ జీవిత కాలంలో ఎన్నడైనా రైతుల గురించి పట్టించుకొందా? అని ప్రశ్నించారు. సమైక్య పాలనలో తెలంగాణపై వివక్ష చూపారని, కాంగ్రెస్ పాలనలో అన్నీ వైఫల్యాలేనన్నారు. వారి హయాంలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని విమర్శించారు. నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిండు అసెంబ్లీలో ఒక్క పైసా కూడా ఇవ్వను ఏం చేస్తావో చేసుకో అని అన్నప్పుడు.. తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ముసిముసి నవ్వులు నవ్వుతూ మిన్నకుండిపోయారని, ఆ రోజు కనీసం ఒక్కరైనా లేచి ప్రశ్నించారా? అని అడిగారు. పొన్నాల నీళ్లను, నిధులను సీమాంధ్రులకు దోచిపెట్టారని మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు. అకాల వరదలు, విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా పట్టించుకుందా? అని ప్రశ్నించారు. కనీసం మంత్రులెవరూ రైతులను పరామర్శించలేదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు యత్నించలేదన్నారు. దళితుల సంక్షే మాన్ని కాంగ్రెస్ ఏనాడూ పట్టించుకోలేదన్నారు. దళితులు, గిరిజనుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభు త్వం కృషి చేస్తోందన్నారు. రాబోయే ఐదేళ్లలో లక్ష మంది దళితులకు భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట ా్టమన్నారు. ఇచ్చిన మాట మేరకు రూ.19వేల కోట్ల రుణమాఫీ మంజూరు చేస్తామని తెలిపారు. ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వరంగల్‌లో ఎక్కువ భూములు ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు తండ్రి లాంటివారని, తనపై చేసిన మాటలను వ్యక్తిగతంగా చూడవద్దని కోరారు.