స్వల్ప ఘటనలు మినహా ఉప ఎన్నికలు ప్రశాంతం

3

మూడు లోక్‌సభ, 33 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) :

స్వల్ప ఘటనలు మినహా ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా మూడు లోక్‌సభ, 33 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. గుజరాత్‌ లోని వడోదరా, ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌ పురి, తెలంగాణలోని మెదక్‌ లోక్‌సభ ని యోజకవర్గాల్లో ఓటుహక్కు వినియో గించుకొనేందుకు ఓటర్లు ఉదయం నుంచే బారులుతీరారు. తొలుత మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌.. ఆ తర్వాత క్రమంగా పుంజుకొంది. మధ్యాహ్నం సమ యానికే సుమారు 50శాతం ఓటింగ్‌ నమోదైంది. ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రజలు ఆసక్తి కనబరచడంతో పోలింగ్‌ కేంద్రాలన్నీ కిటకిటలాడాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వడోదర స్థానానికి, ఎస్పీ అధినేత ములాయంసింగ్‌ మైన్‌పురి స్థానానికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ లోక్‌సభకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు నియోజకవర్గాలతో పాటు పది రాష్టాల్ల్రో 33 అసెంబ్లీ నియోజకవర్గాలకు శనివారం ఉప ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లోని 11 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఓటుహక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు బారులు తీరారు. దీంతో పోలింగ్‌కేంద్రాల వద్ద ఉత్సాహ వాతావరణం నెలకొంది. గుజరాత్‌లో 9, రాజస్తాన్‌, అస్సాంలలో మూడు స్థానాల్లో, పశ్చిమబెంగాల్‌లో 2చోట్ల, త్రిపుర, అస్సాం, చత్తీస్‌గఢ్‌, సిక్కిం, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్కో నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఓటుహక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులుతీరారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించింది. చత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరుగుతున్న నక్సల్‌ ప్రభావిత ప్రాంతమైన అనంతగఢ్లోని పోలింగ్‌ కేంద్రం సవిూపంలో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఐదు కిలోల బాంబును స్వాధీనం చేసుకున్నారు.