సీమాంధ్రులకు అభద్రతాభావమన్నది ట్రాష్‌

3

హైదరాబాద్‌లో వారు సురక్షితమే

పుకార్లను ఖండించిన గవర్నర్‌ నరసింహన్‌

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి) : హైదరాబాద్‌లో సీమాంధ్రులకు అభద్రతాభావం ఉందనడం అవాస్తవమని గవర్నర్‌ నరసింహన్‌ స్పష్టంచేశారు. ఉమ్మడి రాజధానిలో వారు సు రక్షితం గానే ఉన్నారని చెప్పారు. వారు అభద్ర తకు గురవుతున్నారని వస్తున్న వార్తలను గవ ర్నర్‌ ఖండించారు. అదంతా విూడియా సృష్టి అని మండిపడ్డారు. సోమవారం హస్తిన పర్యట నకు వెళ్లిన నరసింహన్‌ ఢిల్లీలో బిజీబిజిగా గడి పారు. ఉదయమే రాజధానికి చేరుకున్న ఆయన కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జగదేకర్‌, అశోక్‌గజపతిరాజు, స్మృతిఇరానీతో వరుసగా సమావేశమయ్యారు. రాష్టాల్ల్రోని పరిస్థితిపై ఆయన కేంద్ర మంత్రులతో చర్చించారు. రాష్ట్ర విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలో పేర్కొన్న అంశాలపై మరింత స్పష్టత కోరారు. ఉమ్మడి సంస్థల విభజనపై త్వరగా స్పష్టత ఇవ్వాలని నరసింహన్‌ కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. వీలైనంత త్వరగా విభజన ప్రక్రియను పూర్తి చేయాలని సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రెండు షెడ్యూళ్లలో పేర్కొన్న ఉమ్మడి సంస్థలు, విభజన వంటి వాటిపై త్వరగా స్పష్టత ఇవ్వాలని కోరారు. అలాగే, అఖిల భారత సర్వీసు అధికారులతో పాటు ఉద్యోగుల పంపిణీని త్వరగా పూర్తిచేయాలని విన్నవించారు. సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జగదేకర్‌తో భేటీ సందర్భంగా రెండు చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై చర్చించినట్లు సమాచారం. కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజును కలిసిన అనంతరం నరసింహన్‌ విూడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో పేర్కొన్న తొమ్మిది, పది షెడ్యూళ్లలో ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేశారు. అయితే, వాటిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. విభజన తర్వాత రెండు తెలుగు రాష్టాల్రు వేగంగా అభివృద్ధి చెందుతాయని ఆయన ఆకాంక్ష వ్యక్తంచేశారు. రెండు రాష్టాల్ర ముఖ్యమంత్రులు మంచి విజన్‌తో పని చేస్తున్నారని కితాబునిచ్చారు. వారు త్వరలోనే ఆయా రాష్ట్రాలను అభివృద్ధి బాటలో తీసుకెళ్తారన్నారు.

అదంతా విూడియా సృష్టే..

హైదరాబాద్‌లో సీమాంధ్రులు అభద్రతాభావంతో ఉన్నారనడం అవాస్తమని నరసింహన్‌ అన్నారు. ఉమ్మడి రాజధానిలో సీమాంధ్రులు అభద్రతాభావంతో ఉన్నారని ఓ విలేకరి వ్యాఖ్యానించగా.. గవర్నర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అదంతా విూడియా సృష్టేనని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ఎవరికీ ఎలాంటి భయాందోళన అవసరం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఎవరైనా నిశ్చింతగా ఉండవచ్చని, రెండు రాష్టాల్ల్రో ప్రతి ఒక్కరికీ భద్రత ఉందని చెప్పారు.