నిజాంకు ధన్యవాదాలు

1

ఒత్తిళ్లకు లొంగలేదు

తన దేశాన్ని మనదేశంలో కలిపాడు

సెప్టెంబర్‌ 17 జాతి గర్వించదగ్గ దినం

రాష్ట్ర ¬ంశాఖ మంత్రి నాయిని

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : ఎన్నో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ నిజాం తన సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారని రాష్ట్ర ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సెప్టెంబర్‌ 17 తెలంగాణ విలీనం సందర్భంగా బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమై 66 ఏళ్లు పూర్తయిందన్నారు. ఈ సందర్భంగా నిజాంకు తెలంగాణ ప్రజలు ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం పాలనవైపు అడుగులు పడిన రోజు సెప్టెంబర్‌ 17 అని తెలిపారు. జాతి గర్వించదగ్గ రోజుగా ఆయన అభివర్ణించారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు అనవసరం రాద్ధాంతం చేయడం తగదని హితవుపలికారు. ప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనమై 66 వసంతాలు పూర్తైనా ప్రజల్లో అదే స్ఫూర్తి ఉందన్నారు. ప్రజాస్వామ్యం రాచరిక వ్యవస్థ తలవంచక తప్పదనే విషయం తేలిపోయిన రోజుగా గుర్తుండిపోతుందన్నారు. చార్మినార్‌ సాక్షిగా స్వేచ్ఛా గీతం ఆలపించిన రోజులు తెలంగాణ ప్రజలు ఎన్నిటికీ మరిచిపోలేరన్నారు. ఆపరేషన్‌ పోలో పేరుతో సర్దార్‌ వల్లాబాయ్‌ పటేల్‌ నేతృత్వంలోని భారత సైన్యం మీర్‌అలీ ఉస్మాన్‌ఖాన్‌ లొంగదీసుకొని భారత్‌లో విలీనం చేసింద న్నారు. దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వస్తే తెలంగాణకు 1948 సెప్టెంబర్‌ 17న వచ్చిందన్నారు. భారత సైన్యానికి, నిజాం సైన్యానికి మధ్య దాదాపుగా ఐదు రోజులపాటు జరిగిన వీరోచిత యుద్ధంలో నిజాం ప్రభుత్వ తలవంచకతప్పలేదన్నారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించకుండా ఇచ్చిన అన్ని హామీలను అమలుచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిరంజన్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజ్‌, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.