ఆ వార్త నిజంకాదు
గడువులోగా పూర్తి
తెలంగాణ సర్కారు పూర్తి సహకారం
ఎల్‌అండ్‌టీ ప్రతినిధి గాడ్గిల్
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (జనంసాక్షి) :
మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి తాము వైదొలుగుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని ఎల్‌అండ్‌టీ కొట్టిపారేసింది. ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును నిర్దేశిత గడువులోగా పూర్తిచేస్తామని నిర్మాణ సంస్థ స్పష్టంచేసింది. మెట్రో రైలు నుంచి ఎల్‌అండ్‌టీ సంస్థ తప్పుకోనుందంటూ పత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో బుధవారం గాడ్గిల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో సమావేశమయ్యారు. విూడియాలో వచ్చిన వార్తలపై చర్చించారు. భేటీ ముగిసిన అనంతరం గాడ్గిల్ విూడియాతో మాట్లాడారు. ప్రాజెక్టుకు ఎలాంటి అవాంతరాలు లేవని.. తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉందని అన్నారు. ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయంలో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయని.. వాటిని ప్రభుత్వ సహకారంతో పరిష్కరించుకొని ముందుకు వెళ్తామని గాడ్గిల్ తెలిపారు. ఏ ప్రాజెక్టుకు అయినా అవాంతరాలు ఉంటాయని, వాటిని పరిష్కరించుకోవడానికి వందలు, వేల లేఖలు రాస్తుంటామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, ఎల్‌అండ్‌టీ సంస్థపై దుష్ప ప్రచారం చేసేందుకే కొన్ని విూడియా సంస్థలు దుష్పచ్రారం చేస్తున్నాయని విమర్శించారు. మెట్రో ప్రాజెక్టుపై విూడియాలో వచ్చిన వార్త కథనాలు దుర దృష్టకరమని వ్యాఖ్యానించారు. లేఖలోని కొన్ని అంశాలను వార్తాకథనాలుగా మలిచి ప్రచురించడం బాధాకరమని.. నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు రాయడం సరికాదని హితవు పలికారు. మెట్రో రైలు పనులు ఆగిపోతా యంటూ పత్రికల్లో వచ్చిన కథనాలు దురదృష్టకరమన్నారు. పత్రికల్లో కథనాలు చూసి ఉదయం నుంచి అనేక ఫోన్లు వచ్చాయని, తాను ఎవరికీ ఎలాంటి సమాచారం పంపలేదని స్పష్టం చేశారు. మెట్రో ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని తెలిపారు. భారీ ప్రాజెక్టులు అన్నాక చిన్న చిన్న సమస్యలు రావడం సహజమేనన్నారు. వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఎల్‌అండ్‌టీ సంస్థపై కొన్ని విూడియా సంస్థలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. మెట్రో ఆగిపోతుందని వార్తలు రావడం దురదృష్టకరమన్నారు. అందులోని కొంత సమాచారాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే వ్యతిరేక కథనాలు మలిచారని ధ్వజమెత్తారు. ఎంపిక చేసిన విూడియాకే ఈ వార్త లీకులు రావడం బాధాకరమన్నారు. ఎప్పుడో రాసిన ఈ లేఖను ఇప్పుడు ప్రచురించడం సరికాదని గాడ్గిల్ తెలిపారు. ఈ లేఖ ఇప్పుడు రాసిందికాదని.. తెలంగాణ ఏర్పాటుకాకముందు రాసినదని వివరించారు. ఫిబ్రవరి 2014లో ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు కాకముందే కొన్ని అంశాలను అందులో పేర్కొన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖను ఇప్పుడు రాయడంలో అర్థమేమిటన్నారు. మార్చి 2011లో మొదలైన ఈ ప్రాజెక్టు అంశాలను వివరించడం తమ బాధ్యత అని తెలిపారు. పెద్దనగరంలో ఇలాంటి భారీ ప్రాజెక్టు చేపట్టినప్పుడు అవాంతరాలు సహజమని, మాకు ఎదుయ్యే పసమస్యలను చెప్పడం ప్రాజెక్టు పురోగతి దృష్ట్యా అవసరమన్నారు. మేం మెట్రో రైలులో భాగస్వాములం.. లేఖలు రాయడం సహజమని తెలిపారు. ఇద్దరు వ్యక్తులు, సంస్థలు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సహజమని, ఎల్‌అండ్‌టీ, ప్రభుత్వం మధ్య లేఖలు రాయడం తప్పేవిూ కాదన్నారు. ఎల్‌అండ్‌టీ రాసిన సుదర్ఘ లేఖలలో ఇది ఒకానొకటి అని పేర్కొన్నారు. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, నిర్మాణ సంస్థ సమన్వయం, సహకారంతో పని చేస్తాయని చెప్పారు. అన్ని సవాళ్లను సమష్టిగా ఎదుర్కొంటామని తెలిపారు. విూడియాలో వచ్చిన లేఖ వివరాలు ప్రాజెక్టు ప్రతిష్టకు భంగం కలిగించాయని మండిపడ్డారు. సరైన వివరణ లేకుండా కథనాలు ప్రచురించడం బాధాకరమన్నారు. విూడియా ఇష్టం వచ్చినట్లు రాస్తే నేనేందుకు స్పందించాలని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని, ఎక్కడా ఆగిపోలేదని స్పష్టం చేశారు. భారీ ప్రాజెక్టులు అన్నాక చిన్న చిన్న సమస్యలు సహజమని తెలిపారు. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభుత్వం మాకు సహకరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా మెట్రో రైలును పూర్తిచేస్తామని చెప్పారు. మెట్రో ప్రాజెక్టు పనులు చిత్తశుద్ధితో పూర్తి చేస్తామని మరోసారి స్పష్టంచేస్తున్నామని తెలిపారు. ఇది లాభసాటి ప్రాజెక్టే అని గతంలో పలుమార్లు చెప్పాం.. ఇప్పుడూ చెబుతున్నామని స్పష్టం చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు రాయొద్దని సూచించారు. దేశంలోనే అత్యంత వేగంగా సాగుతోన్న ప్రాజెక్టు ఇదని, దీనిపై దుష్పచ్రారం సరికాదన్నారు. ప్రాజెక్టు పురోగతిపై లేఖలు రాయడం నేరం కాదని గాడ్గిల్ అభిప్రాయపడ్డారు. లేఖలు రాసిన మాట వాస్తవమేనని, సమస్యలను సున్నితంగా పరిష్కరించుకోవాలన్నది మా అభిమతమని తెలిపారు. మెట్రో విషయంలో గతంలో కూడా ఏపీ సర్కారుతో అనేక సంప్రదింపులు జరిపామని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. మెట్రో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే ప్రాజక్టును స్వాధీనం చేసుకోవాలని లేఖరాసిన మాట వాస్తవమేనని, అయితే దాన్నే యథాతథంగా తీసుకొని కథనాలు రాయడం వల్ల బ్బంది అవుతుందన్నారు. తాము ఫిబ్రవరి నుంచే ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నామని చెప్పారు. అయితే ఇంతవరకు ఎక్కడా పనులు మాత్రం ఆపలేదన్నారు. సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని. వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. అయితే, ఇలాంటి కథనాలు రాయడం వల్ల స్ఫూర్తి దెబ్బతింటుందన్నారు. మెట్రో అలైన్‌మెంట్ మార్పుపై తమకు అధికారిక సమాచారం లేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.