ఢిల్లీలో దూసుకుపోతున్న ఆప్… 61 స్థానాల్లో ముందంజ

మంగళవారం, 10 ఫిబ్రవరి జ‌నంసాక్షి

arvind kejriwal

 

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. మరే పార్టీ కూడా ఆ పార్టీ దరిదాపుల్లో కూడా లేవు. సర్వే అంచనాలను మించి ఆప్ 57 స్థానాలలో ముందంజలో ఉంది. భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్ కు అటూ ఇటూ ఊగిసలాడుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే  స్థానంలో లీడ్ ప్రదర్శిస్తోంది. ఢిల్లీ ప్రజలు ఈ పర్యాయం చాలా స్సష్టంగా మెజారిటీని అందించారు. వివరాలిలా ఉన్నాయి. 
ఢిల్లీ శాసనసభకు ఏడో తేది ఎన్నికలు జరిగాయి. మొత్తం 70 స్థానాలు ఉన్న అసెంబ్లీకి 70 స్థానాలలో పోలింగ్ జరిగింది. ఓటరు బారులు తీరి ఓటేశారు. వీటికి సంబంధించి 14 కేంద్రాల్లో జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకోసం ఎన్నికల సంఘం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యింది. ఇప్పటికే 61 స్థానాలలో ఆప్ తిరుగు లేని మెజారిటీతో దూసుకుపోతోంది. 
గట్టి పోటీ ఇస్తుందనుకున్న భారతీయ జనతా పార్టీ దరిదాపులలో కూడా లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. 10 అటు ఇటుగా ఊగిసలాడుతోంది. ఇక కాంగ్రెస్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. కేవలం ఒకే ఒక స్థానంలో మాత్రమే ముందంజలో ఉంది.  మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూర్తి ఫలితాలు విడుదలయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. చివరకు భారతీయ జనతా పార్టీ సిఎం అభ్యర్థి కూడా వెనుకంజలో ఉన్న పరిస్థితి.