9నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

వివిధ అంశాలపై చర్చకు రెడీ అవుతున్న విపక్ష టిడిపి

అమరావతి,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): ఎపిలో జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇసుక కొరత, అమరావతి నిర్మాణం, మతమార్పిడులు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా రాజధాని అంశం తీవ్ర దుమారం రేపనుంది. మంత్రుల వ్యాఖ్యలు, ప్రభుత్వ చర్యల కారణంగా మఅరావతి ఆగిపోయిందన్న ఆందోళనలను టిడిపి వ్యక్తం చేసింది. రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని అమరావతిలోనే కొనసాగించాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, పలు రంగాలకు చెందిన మేధావులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై సందేహాలు రేకెత్తిస్తూ మంత్రులు, వైసీపీ నాయకులు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలోని ఏ-1 కన్వెన్షన్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయా రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల నాయకులు, మేధావుల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం జరగాలిన కోరుకుంటున్నారు. ఈ దశలో జరగనున్న శీతాకాల సమావేశాల్లో ఈ అంశం ప్రధాన చర్చగారానుందని భావిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రూరల్‌ ఎస్పీ సీహెచ్‌వి విజయరావు స్పష్టం చేశారు. ఈ మేరకు అసెంబ్లీ వద్ద వివిధ విభాగాల అధికారులతో అడ్వాన్స్‌ సెక్యూరిటీ లైజాన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిలిజెన్స్‌,ఎలక్ట్రిసిటి, ఫైర్‌ తదితర విభాగాల అధికారులతో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లు తీసుకోవాల్సిన చర్యలపై సవిూ క్షించారు. అసెంబ్లీ వద్ద ముందస్తు ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. సమావేశాలకు హాజరయ్యే మంత్రులు, ఎమ్మెల్యేల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. వాహ నాలు నిలిపివేందుకు పార్కింగ్‌ స్థలం కేటాయించామన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసి నట్లు తెలిపారు.