9 రోజులపాటు శాసనసభ సమావేశాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ వ్యవహారాల సలహా సంఘం సమావేశం ముగిసింది. 9 రోజులుపాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21 వరకు సమావేశాలు జరగనున్నాయి. మరోవైపు శాసనసభ సమావేశాలను మరో 10 రోజులు పెంచాలని తెదేపా చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరింలేదు. శాసనసభలో తెలంగాణ తీర్మానం ప్రవేశపెట్టాలని ఈ భేటీలో తెరాస డిమాండ్‌ చేసింది.