నిరుపేదలకు ఆపద్బాంధవుడు…. నాయిని వెంకట్ గౌడ్ (గజిని)
మెదక్ బ్యూరో అక్టోబర్ 28( జనం సాక్షి ): నిరుపేదలకు అండగా నిలుస్తూ ఆపద్బాంధవుడులా తనకు తగిన ఆర్థిక సహాయం అందజేస్తున్న అప్పాజీపల్లి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, మండల గౌడ సంఘం అధ్యక్షులు, నాయిని సునీత వెంకట్ గౌడ్ (గజిని) . ఆదివారం నాడు అప్పాజీ పల్లి గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల లక్ష్మయ్య అంత్యక్రియలకు 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అప్పాజీపల్లి గ్రామస్తుడైన పిచ్చకుంట్ల లక్ష్మయ్య గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ మెదక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆరోగ్యం కుదుటపడకపోవడంతో శనివారం హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు మృతుడు లక్ష్మయ్య అంత్యక్రియలు ఆదివారం నాడు స్వగ్రామంలో నిర్వహించారు ఆయన అంత్యక్రియలకు 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసి నా నాయిని వెంకట్ గౌడ్ (గజిని) లక్ష్మయ్య అంత్యక్రియలలో పాల్గొన్నారు. ఆయన వెంట చింతల కిషన్, పిచ్చకుంట్ల నర్సింలు, బాగా ఇయ్యాల పోచయ్య, తిమ్మక్క పల్లి నర్సింలు, తదితరులు ఉన్నారు.