భార్యను హతమార్చిన భర్త

 

కలకాలం జీవితాంతం తోడుంటానని అగ్ని సాక్షిగా మనువాడిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అనుమానం పెనుభూతంగా మారి.. పెళ్లినాటి ప్రమాణాలను మర్చిపోయి భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు(Brutal murder). ఈ విషాదకర సంఘటన జగిత్యాల జిల్లా(Jagityala )మల్లాపూర్‌ మండలం వేంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వెలుమల సునీత(30), రమేష్‌ దంపతులు.

కొంతకాలంగా కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటున్నాయి. సునీతపై అనుమానం పెంచుకున్న రమేష్‌ బుధవారం ఆమెను హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సునీత మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.