రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణకే పాదయాత్ర : జై బాపు,జై భీమ్,జై సంవిధాన్
చిలప్ చెడ్, (జనంసాక్షి) : రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ఉద్దేశంతో జై బాపు, జై భీమ్, జై సoవిదాన్ పాదయాత్రలు చేపట్టినట్లు టిపిసి సాధికార ప్రతినిధి ఆవుల రాజు రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ అన్నారు. శనివారం నాడు చిలప్ చెడ్ మండలంలో ఫైజాబాద్, బండపోతుగల్, అజ్జమర్రి గ్రామాలలో జై బాపు జై భీమ్ జై సమ్మిదాన్ భాగంగా నిర్వహించిన పాదయాత్రలో డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ. ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో తెల్ల దొరల నుంచి టైంశాలతో స్వాతంత్రం సాధించిన మహాత్మా గాంధీ మనందరికీ స్ఫూర్తి అని కొనియాడారు. స్వాతంత్ర దేశానికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారని వివరించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ స్ఫూర్తిగా పొడుస్తుంది అన్నారు. రాజ్యాంగం ప్రజాస్వామ్య పరిరక్షణకు గాంధీజీ స్మరించుకుంటూ జై బాబు రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా జై భీమ్, జై సoవిదాన్ చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు పాండరి,విఠల్ రెడ్డి, విశ్వంభర స్వామి, భూమయ్య, సుభాష్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి,దుర్గాచలం,చిరంజీవి, రవి, బుచ్చిరెడ్డి, మల్లేశం,లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాపయ్య,పరశురాం రెడ్డి, సుధీర్ రెడ్డి, బాబు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.