వెల్దుర్తి తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ రైడ్

వెల్దుర్తి, డిసెంబర్ 3 (జనం సాక్షి ):మెదక్ జిల్లావెల్దుర్తి తాసిల్దార్ కార్యాలయం పై బుధవారం ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. ఓ రైతు నుండి 20వేల లంచం తీసుకున్న సర్వే శ్రీనివాస్ ఏసీబీ డి.ఎస్.పి సుదర్శన్ పట్టుకున్నారు. వెల్దుర్తి గ్రామానికి చెందిన ఓ రైతు తన ఒక ఎకరా 20 గుంటల భూమిని డిజిటల్ సర్వే చేయాలని అతని వద్ద నుండి 20వేల రూపాయలు వెల్దుర్తి సర్వేర్ శ్రీనివాస్ తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగిందని సర్వేయర్ పై ఆరోపణలు ఉన్నాయని ఎంక్వయిరీ చేస్తున్నట్లు వారు తెలిపారు.



