ఎడపల్లి మండల కేంద్రంలో ఘనంగా… అంబేద్కర్ జయంతి వేడుకలు

ఎడపల్లి, (జనంసాక్షి) : ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేతరి గంగాధర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలో గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం యువకులు గ్రామంలో వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా అంబేద్కర్ సంఘం భవనం నుండి మహిళలు హారతులు, డప్పు మేలాలతో ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో ఎంతో మంది పాల్గొన్నారు. ఈ వేడుకలలో ఎడపల్లి గ్రామ రాజకీయ పార్టీ నాయకులు, కుల సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు, వివిధ గణేష్ మండలి సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ శంకర్ నాయుడు, మాజీ ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, సహకార సంఘం చైర్మన్ పోల మల్కారెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బంజ కామప్ప, బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ కందగట్ల రాంచందర్, ఎడపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యులు నాయుడు స్రవంతి పోతన్న, మెకానిక్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ మెంబర్ జహీర్ ఖాన్, రజక సంఘం అధ్యక్షులు మల్లెపూల శ్రీనివాస్, రెడ్డికా సంఘం మండల అధ్యక్షులు నగేష్, మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాస్, గోసంగి సంఘం అధ్యక్షులు శ్రీను, వీరముష్టి సంఘం అధ్యక్షులు సందీప్, సార్వజనిక్ గణేష్ మండలి సభ్యులు రఘు ముదిరాజ్, గౌడ సంఘం సభ్యులు రమణ గౌడ్, గంగపుత్ర సంఘం సభ్యులు వార్డ్ మెంబర్ గోపి, అంబేద్కర్ యువజన సంఘ కార్యవర్గం జొగ్గరి నరేందర్, మచ్కూరి మోహన్, కర్రోల్ల గంగాధర్, అల్కే పోచయ్య, మచ్కూరి గంగాధర్, జొగ్గరి మోహన్, బక్కోళ్ల శ్రీనివాస్, యువకులు సాయి చిరు, శివకుమార్, ఉమేష్, సందీప్, ప్రభాకర్, డప్పు కళాకారులు, సపై కార్మికులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.