ఏపీ ఈఏపీసెట్‌ల్లో తెలంగాణ విద్యార్థి శ్రీశాంత్‌రెడ్డి సత్తా

 ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి యెల్లు శ్రీశాంత్‌రెడ్డి సత్తా చాటాడు. అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో శ్రీశాంత్‌రెడ్డి ప్రథమ ర్యాంకు సాధించాడు. మంగళవారం అమరావతిలో ఈఏపీసెట్‌ ఫలితాలను ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జే శ్యామలరావు విడుదల చేశారు.ఇంజినీరింగ్‌లో 75.51 శాతం ఉత్తీర్ణత, అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌లో 87.11 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత మే 16 నుంచి 23 వరకు ఈఏపీసెట్‌ నిర్వహించారు. ఇటీవల ప్రాథమిక కీని వెల్లడించిన అధికారులు తాజాగా ఫలితాలను విడుదల చేశారు.