ఐదవ వార్డ్ గారుదాద్రి కాలనీలో బతుకమ్మ సంబరాలు

 

నల్గొండటౌన్, అక్టోబర్ 11(జనంసాక్షి)
నల్గొండ పట్టణంలోని ఐదో వార్డ్ గారుడాద్రి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యములో సద్దుల బతుకమ్మ పండుగను గురువారం నాడు గరుడాద్రి నగర్ కాలనీ లో కన్నుల పండువగా నిర్వహించారు. బతుకమ్మ అతి పెద్ద పూల పండుగ భాద్రపద అమావాస్య రోజున మొదలు పెట్టి దుర్గాష్టమి రోజున జరుపుకునే సద్దుల బతుకమ్మ వరకు మొత్తము 9 రోజులు తొమ్మిది పేర్లతో బతుకమ్మ పూజాలందుకుంటుంది సంప్రదాయ పూలైన తంగేడు, జిల్లేడు పూలతో పాటు వివిధ రకాల పూలతో అందముగా పేర్చిన బతుకమ్మలను కాలానీలోని కూడలి లో చేర్చి సంప్రదాయ దుస్తులు దరించిన చిన్నారులు, యువతులు మహిళలు పాల్గొని గౌరీదేవికి పూజలు నిర్వహించి, బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చప్పట్లు, ఆట,పాట, నృత్యాలతో బతుకమ్మ వేడుకలను వైభంగా నిర్వహించి అనంతరం పానగల్ సమీపములోని కాలువలో బతుకమ్మలను నిమజ్జనం చేసినారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడము వలన చిన్నారులకు ప్రకృతి మరియు సంస్కృతి సంప్రదాయల పట్ల అవగాహన పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు కాలనీ వాసులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.