ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా : పైసా రాజశేఖర్

బచ్చన్నపేట డిసెంబర్ 11 ( జనం సాక్షి): జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని బచ్చన్నపేట సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను టూత్ పేస్ట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించలని సర్పంచ్ అభ్యర్థి పైసా రాజశేఖర్ అన్నారు. గురువారం గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తూ గ్రామ సమస్యలపై గత 30 40 సంవత్సరాలుగా గ్రామపై పట్టున్న వ్యక్తిగా ప్రజా సమస్యలపై చదువుకుంటూ 10 సంవత్సరాలు పోరాటం చేసిన వ్యక్తిగా గ్రామ సమస్యలపై నిరంతరం పర్య వేక్షణ చేస్తున్న నన్ను ఆశీర్వదించి టూత్ పేస్ట్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని అన్నారు. స్థానికంగా ఉంటూ డ్రైనేజీ. వీధిలైట్లు. త్రాగు నీటితో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు


