ముస్లిం నేత ఖలీద్ పై బీఆర్ఎస్ నాయకుల దాడి

కరీంనగర్ : ముస్లిం జేఏసీ జిల్లా అధ్యక్షుడు ప్రముఖ కరీంనగర్ భూస్వామి ముస్లిం స్వచ్ఛంద సంఘాల ప్రతినిధి కరీంనగర్ ముస్లిం సమాజానికి ఆత్మీయుడైనటువంటి ఎలాంటి మచ్చలేని మనిషి షేక్ అబూబకర్ హోటల్ మానేరు అధిపతి షేక్ అబూ బకర్ ఖాలీద్ పై బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి గంగుల కమలాకర్ ముఖ్య అనుచరుడు నందేల్లి మహిపాల్ సొంత అన్న రేకుర్తి మాజీ సర్పంచ్ నందేల్లి ప్రకాష్ దాడి చేశారు. కారు అద్దాలు పగులగొట్టి బీభత్సం సృష్టించారు. గంగుల కమలాకర్ ఓటమి చెందుతున్నాడనే అక్కసుతోనే ఈ దుశ్చర్యకు దిగారని ముస్లిం నాయకులు అంటున్నారు. భూ కబ్జాతో పాటు భౌతిక దాడులకు పాల్పడుతున్న అధికార పార్టీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.