ఐఆర్ఏ అల్యూమినియం మూతల కంపెనీని ప్రారంభించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్ రెడ్డి

గుర్రంపోడు (జనంసాక్షి): గుర్రంపోడు మండలం పాశం వారి గూడెంగ్రామానికి చెందిన పాశం వేణుగోపాల్ రెడ్డి హైదరాబాద్ మేడ్చల్, కాప్రా నవోదయ ఇండస్ట్రియల్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ ఆర్ ఏ ఇండస్ట్రియల్స్ అల్యూమినియం మూతల కంపెనీని వారు పిలుపుమేరకు విచ్చేసిన బి ఆర్ స్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొంది ఆర్థికంగా ఎదగాలని గుర్రంపొడు మండలం వారు ప్రతి రంగంలో అడుగు పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం నల్లగొండలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి నల్గొండ ఉమ్మడి ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి తో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రైవేట్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు మునికుంట్ల రాజేష్ రెడ్డి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.