వార్తలు

ఈ నెల 6 నుంచి కొత్త రైళ్లు

సికింద్రాబాద్‌: ఈ నెల 6 నుంచి కొత్తగా నాలుగు రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది. బెల్లంపెల్లి-హైదరాబాద్‌ ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్‌, దర్బాంగా-సికింద్రాబాద్‌ల మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు …

చార్జిషీటు దాఖలు చేస్తాం:సీబీఐ

ముంబయి:ఆదర్శ కుంభకోణంలో ఇవాళ చార్జీషీటు దాఖలు చేస్తామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది.ఈ కుంభకోణంలో మహరాష్ట్ర ప్రభుత్వం వైఖరిపై రెండు వారాల్లో స్పందించాలని హైకోర్టు రక్షణ శాఖను ఆదేశించింది.

కేర్‌ సెంటర్‌ నిర్లక్ష్యంతో రెండేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్‌:ఎల్‌బీనగరలోని పిల్లల సంరక్షణ కేంద్రంలో రెండేళ్ల చిన్నారి మృతిచెందింది.చపాతి తినిసిస్తుండగా గొంతుకు అడ్డంపడి చిన్నారి అన్విత మరణించింది.చైతన్యపురి ఆర్కేపురానికి చెందిన రజని,లవకుమార్‌ దంపతులకు అన్విత ఏకైక సంతానం …

ఖాళీగా ఉన్న వర్శిటీ వీసీ పదవుల భర్తి :గవర్నర్‌

తిరుపతి:రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయ వీసీ పదవులను భర్తీ చేయనున్నట్లు గవర్నర్‌ నరసింహన్‌ చెప్పారు.శ్రీవారి దర్శనార్థం తిరుపతి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర పరిస్థితులు బాగున్నాయని తిరుమలలో …

ఒలింపిక్‌ క్రీడలకు రక్షణగా క్షిపణి సాంకేతికత వినియోగం

లండన్‌:ఒలింపిక్స్‌కి రక్షణగా బ్రిటన్‌ క్షిపణి సాంకేతిక వ్యవస్థను వినియోగిస్తోంది.విమానాల దాడుల్ని సమర్థంగా ఎదుర్కొనడానికి క్షిపణులను సిద్దంగా ఉంచుకోవాలని ఆ దేశ అంతర్గత భద్రతా వ్యవహరాల మంత్రిత్వశాఖ భావిస్తోంది.అందుకుగాను …

తోటి ఖైదీలపై మరో ఖైదీ దాడి: ఒకరు మృతి

హైదరాబాద్‌ : చర్లపల్లి జైలులో మంగళవారం అర్థరాత్రి ఓఖైదీ వీరంగం సృష్టించాడు. దాసరి నర్సింహులు అనే ఖైదీలపై కత్తెరతో దాడి చేశాడు. ఈ దాడిలో వెంకటయ్య అనే …

300 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కర్నూలు : కర్నూలు జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలోని కొలిమిగుండ్ల పాలాల్లో దాచిపెట్టిన 300 ఎర్రచందనం దుంగలను బుధవారం తెల్లవారుజామున స్వాధీనం …

భార్యను హత్యచేసిన భర్త

చిత్తూరు : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కాచీపెంట్ల గ్రామ శివారులో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. అమెను నాలుగురోజుల క్రితం తన భర్తే హతమార్చి ఓ …

ఢిల్లీలోనూ తప్పని కరెంటు కోతలు

ఢిల్లీ:ఓ పక్క ఉక్కపోత…మరో పక్క కరెంటు కోత…ఢిల్లీ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.నగరంలో పలుచోట్ల ఏకంగా 8,9 గంటలపాటు కరెంటు ఉండడంలేదు.ఆఖనిరి వీఐపీల నివాసాలుండే సెంట్రల్‌ ఢిల్లీ ప్రాంతంలోనూ …

అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

శ్రీకాకులం : ముంబయి నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసులు ఈరోజు రాత్రి అరెస్టు చేశారు. బంగారం విలువ సుమారు రూ.కోటి …