Sunday, 8 November 2026

వార్తలు

సిరిసిల్ల బంద్‌కు తెరాస పిలుపు

కరీంనగర్‌: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్‌ విజయమ్మ పర్యటనను నిరసిస్తూ ఎల్లుండి సిరిసిల్ల బంద్‌కు తెరాస పిలుపునిచ్చింది. విజయమ్మ పర్యటనకు నిరసనగా తెలంగాణ జిల్లాల్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సిరిసిల్ల అంబేద్కర్‌ చౌరస్తాలో తెరాస విద్యార్థి విభాగం…

కలుషిత ఆహారం పెడితే కఠిన చర్యలు: సీఎం

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పంపిణీలో కలుషిత ఆహారం పెడితే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఇటీవల తరచూ కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయని భవిష్యత్‌లో అలాంటి…

సహాయక చర్యలపై అధికారుల సమీక్ష

హైదరాబాద్‌: జంట నగరాల పరిధిలో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలపై రెవెన్యూ, పురపాలక శాఖలు సమీక్ష నిర్వహించాయి. వర్షాల కారణంగా 3,600 కుటుంబాలపై ప్రభావం పడిందని ఆయా శాఖలు తేల్చాయి. వీటిలో 2వేల కుటుంబాలకు ఇప్పటికే…

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ: రాగల 24గంటల్లో ఉత్తర కోస్తా, తెలంగాణలో ఓ మోస్తరు నుంచిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్పపీడనం.. వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇదే…

జీన్స్‌ ధరించిందని చెల్లెల్ని హత్య

లాహోర్‌: మగవారు ధరించే జీన్స్‌ దుస్తులు ధరించిందంటూ తోబుట్టువునే కడతేర్చాడు పాకిస్థాన్‌కు చెందిన ఓ రక్షక భటుడు. శుక్రవారం లాహోర్‌లో జరిగిన ఈ ఘటనను అధికారులు శనివారం వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం నజ్మా బీబీ(22) జీన్స్‌ ధరించారు.…

ప్రశాతంగా గ్రూప్‌-2 మొదటిరోజు పరీక్ష

హైదరాబాద్‌: రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన గ్రూప్‌-2 మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మిగిలిన రెండు పరీక్షలు ఆదివారం జరగనున్నాయి. మొదటి రోజు పరీక్షకు సంబందించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని ఏపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య…

పసికందు అమ్మకానికి యత్నం

మహబూబ్‌నగర్‌: స్థానిక న్యూట్‌న్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శిశువును విక్రయించేందుకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులకు సమాచారం అందించడంతో పసికందును పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. పసికందును అమ్మకానికి విక్రయించిన వారిపై కఠిన చర్యలు…

మరో 36 గంటలు వర్షాలు : జీహెచ్‌ఎంసీ కమీషనర్‌

మైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 36 గంటల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జంట నగరాల్లోని అధికార్లందరు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు సూచించారు. నగరంలో వర్షం కారణంగా మృతి చెందిన కుటుంబాలకు రెవెన్యూ, పురపాలక…

నౌకదళంలో చేరిన ఐఎన్‌ఎన్‌ సహ్యద్రి

మంబాయి: దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన స్టెల్త్‌ యుద్ధనౌక యుద్ధనౌక ఐఎన్‌ఎన్‌ సహ్యాద్రి..నౌకదళంలో చేరింది. దీతో మన జలాంతర్గామి విధ్వంసక పోరాట సామర్థ్యం మరింత పెరిగింది. శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోని ఈ యుద్ధనౌకను…

ఉపరాష్ట్రపతి పోరులో అన్సారీ, జశ్వంత్‌ ముఖాముఖి

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల మాదిరిగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ముఖాముఖి పోరు జరుగనుంది. శనివారం చేపట్టిన నామినేషన్ల పరిశీలన యూపీఏ అభ్యర్థి హమీద్‌ అన్సారీ, ఎన్డీయే అభ్యర్థి జశ్వంత్‌ సింగ్‌ల పఆరతల మాత్రమే సక్రమంగా ఉన్నట్లు తేలింది. ఎంపీల మద్దతు…