అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యం:బుర్ర దేవేందర్ గౌడ్

 

 

 

నడికూడ, డిసెంబర్ 11 (జనం సాక్షి):అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ అన్నారు. గురువారం రోజున మండలంలోని నర్సక్కపల్లి గ్రామంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాడి ప్రతాపరెడ్డి, గ్రామ ఎన్నికల పర్యవేక్షకుడు చందుపట్ల రాఘవరెడ్డి తో కలిసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తలగంప రాణి, వార్డు సభ్యుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, ముఖ్యంగా గ్రామాలలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని, నూతన రేషన్ కార్డులు, మహిళలకు వంటగ్యాస్ సబ్సిడీ, జీరో కరెంటు బిల్లు లాంటి పథకాలు అమలవుతున్నాయని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తలగంప రాణి బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఎంపీటీసీ బుర్ర దీప దేవేందర్ గౌడ్, పలు వార్డుల అభ్యర్థులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.