నూతన సంవత్సర 2026 క్యాలెండర్‌ను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ

 

 

 

 

 

సంగారెడ్డి, డిసెంబర్ 29( జనం సాక్షివిశ్రాంత పోలీసు ఉద్యోగుల సంఘం
నూతన సంవత్సర – 2026 క్యాలెండర్‌ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సోమవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ విశ్రాంత పోలీసు ఉద్యోగులతో మాట్లాడుతూ, రిటైర్డ్ పోలీసు ఉద్యోగుల సంక్షేమం పట్ల జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో జిల్లా పోలీసు శాఖను నిర్భయంగా సంప్రదించాలని సూచించారు. అలాగే రోజూ వ్యాయామం చేస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్పీ సూచించారు.