అంతరంలో జాతర ఉత్సవాలలో అప్పశృతి..

 

 

 

 

 

 

 

 

 

సంగారెడ్డి, నవంబర్ 19 జనం సాక్షి)

గుండంలో పడి వ్యక్తి మృతి

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని అంతారం గ్రామంలో జరుగుతున్న జాతర ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే మునిపల్లి మండలంలోని అంతారం గ్రామంలో గత 5 రోజులుగా జీవన్ముక్త పాండురంగడి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జహీరాబాద్ మండలంలోని కాసింపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి గుండంలో స్నానం చేయడానికి వెళ్లి మృతిచెందాడు. మృతుడు వేసుకున్న బట్టలు గుండం బయట ఉండడంతో స్థానికులు గమనించి గుండంలోని నీళ్లు తొలగించి చూడగా వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని గమనించారు.
సమాచారం మునిపల్లి పోలీసులకు ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తం సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.