డ్రగ్స్ కు అలవాటు పడకండి

నల్గొండటౌన్,ఆగష్టు02 జనంసాక్షిభవిష్యత్తును కాపాడుకోండి
టూటౌన్ ఎస్ఐ నాగరాజుఅన్నపూర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో బిసి కళాశాల బాలుర వసతి గృహం లో మాదకద్రవ్యాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా నల్గొండ టూటౌన్ ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూడ్రగ్స్‌ వాడకం వల్ల సమాజంలో వచ్చే దుష్పరిణామాలు,ఆరోగ్య సమస్యల గురించి విద్యార్థులకు వివరించారు. చాలామంది యువత సరదాగా మొదలుపెట్టిన ఈ అలవాటు వ్యసనంగా మారి వారి భవిష్యత్తును నాశనం చేస్తుందని కాబట్టి విద్యార్థులు అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని విద్యార్థుల గురించి హితవు పలికారు.యువత దేశానికి పట్టుకొమ్మలని వారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలని సమాజాభివృద్ధికి తద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థులకు సూచించారు.ఒక వ్యక్తి డ్రగ్స్‌కి అలవాటు అయితే మాన్పించడం చాలా కష్టమని డ్రగ్స్‌ వినియోగం వల్ల ఆ వ్యక్తి ఏం చేస్తాడో తనకే తెలియదని,మత్తులో నిద్రిస్తాడని,క్రూరమైన ఆలోచనలు కలిగి ఉంటాడని తెలియజేశారు. విద్యార్థులు తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్టు అనుమానంవచ్చినా,విక్రయిస్తున్నట్టు తెలిసిన పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

తాజావార్తలు