డాక్టర్ల నిర్లక్ష్యం.. నిండు బాలింత మృతి

గంభీరావుపేట జనవరి 03 (జనం సాక్షి):ఇద్దరు పాపలకు జన్మనిచ్చి డాక్టర్ల నిర్లక్ష్యం ఒక నిండు బాలింత మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలోరొడ్డ సౌజన్య అలియాస్ (తమ్మనవేణి సౌజన్య ) వయస్సు23 భర్త తమ్మనవేణి భానుచందర్ లు రెండు సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలోనే ప్రేమ వివాహం చేసుకున్నారు, అయితే గత నెల డిసెంబర్ 24వ తేదీ బుధవారం రోజున, సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 8:52 నిముషాలకు మొదటి పాప, 8:55 నిముషాలకు రెండవ పాప జన్మించారు, తదనంతరం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సౌజన్యకు రక్తం తక్కువగా ఉందని కరీంనగర్ లోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో హుటాహుటిన కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్ కి తీసుకెళ్లి అదేరోజు సాయంత్రం6:00 గంటలకు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, పది రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఈరోజు ఉదయం ఉదయం 2:30 గంటలకు సౌజన్య మరణించినట్లు ప్రతిమ హాస్పిటల్ వైద్యులు తెలిపారు, ఆరోగ్యవంతమైన ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన తల్లి సౌజన్య(23) మృతి చెందడం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, దీనికి కారణమైన వారిపై చట్టబద్ధమైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కుటుంబ సభ్యులు బంధువులు కోరారు.


