డా. అగర్వాల్ ఉచిత కంటి వైద్య శిబిరం
భువనగిరి రూరల్, సెప్టెంబర్ 28,జనం సాక్షి :యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డి పల్లి గ్రామం లో డా. అగర్వాల్ ఉచిత కంటి శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో చిన్నపిల్లలనుండి వయో వృద్ధులు, యువకులు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో ఎవరికైనా కంటి సమస్య ఉన్న వారికీ ఉచితంగా కంటి ఆపరేషన్ చేస్తామని తెలిపారు.అలాగే చుట్టు పక్కన గ్రామలకువెళ్ళి ఇ లాంటి వైద్య శిబిరం నిర్వహిస్తామని తెలియ జేశారు. ఈ మంచి అవకాశాన్ని గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పద్మారెడ్డి,మాజీ సర్పంచ్ చుక్క స్వామి, మహిళలు గ్రామసిబ్బందిపాల్గొన్నారు