*(DSP)రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు 10km ల సంఘీభావ పాదాయాత్ర*
బాల్కొండ సెప్టెంబర్ 19 ( జనం సాక్షి ) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రం లొ రాష్ట్ర కమిటీ అదేశాలమేరకు తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది BC,SC,ST ల రాజ్యస్థాపనకై డా.విశారదన్ మహారాజ్ 10,000 km ల స్వరాజ్య పాదయాత్ర లో భాగంగా (15-09-2022) 6నేలలు,3500km లు పూర్తి అయిన సందర్భంగా, బాల్కొండ మండల కేంద్రంలో 10 km ల సంఘీభావ పాదయాత్ర చేయడం జరిగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో DSP మండల అ్యక్షులు సతీష్ మహారాజ్,జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అబ్బాగొని అశోక్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి హరప్పా మహారాజ్, ఉపాధ్యక్షులు నిశాంత్,క్రాంతి కిరణ్ మహారాజ్, కోశాధికారి ఆత్మగౌరవ్ మహారాజ్, మండల కార్యదర్శి దిలీప్ మహారాజ్, కమిటీ సభ్యులు రాజు,రాజశేఖర్,రంజిత్,గోసంగి సంఘం యూత్ సభ్యులు మహారాజ్, వివిధ గ్రామాల DSP ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.