అనారోగ్యంతో గురిజాల మాజీ సర్పంచ్ మృతి…
నివాళులర్పించిన పలు రాజకీయ పార్టీల నాయకులు…
చెన్నారావుపేట, డి
సెంబర్ 2 (జనం సాక్షి): అనారోగ్యంతో గురిజాల గ్రామ మాజీ సర్పంచ్ గుగులోతు ఎల్లయ్య(56) అనారోగ్యంతో మృతి చెందాడు. మండలంలోని ఉమ్మడి గురిజాల గుంటూరు పల్లె గ్రామ శివారు భీమ్లా నాయక్ తండా కు చెందిన ఎల్లయ్య 2013 నుండి 2018 వ సంవత్సరం వరకు ఉమ్మడి గురిజాల గ్రామ టిడిపి సర్పంచ్ గా పనిచేశారు. అనంతరం టిడిపి పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. గురిజాల గ్రామ సర్పంచ్ గా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. సర్పంచ్ పదవి అయిపోయే ముందు గ్రామపంచాయతీలో రూ.8 లక్షల రూపాయలను మిగులు బడ్జెట్ గా చూపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అనంతరం ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఎల్లయ్యకు భార్య రుక్మిణి, కుమారుడు శశి కుమార్, కుమార్తె గౌతమిలు ఉన్నారు. మాజీ సర్పంచ్ ఎల్లయ్య మృతి చెందడంతో పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి గురిజాల గ్రామస్తులు అతని మృతదేహం పై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.



