స్వర్ణశ్రీ జ్యూయలర్స్ షాప్ ను ప్రారంభించిన మాజీ జెడ్పిటిసి గాలి రవికుమార్ గౌడ్
గుర్రంపోడు (జనంసాక్షి): నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని నాంపల్లి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్ణ శ్రీ జ్యూయలర్స్ షాప్ ను సోమవారం మండల మాజీ జడ్పిటిసి గాలి రవికుమార్ గౌడ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలో అన్ని రకాల ఆధునిక బంగారు ఆభరణాలు లభించే పెద్ద షాపును ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. స్వర్ణ శ్రీ జ్యూయలర్స్ యజమానులు తరిటే సుధాకర్, తరటే రమణయ్య, జాజం సాయి లు మాట్లాడుతూ.. తమ వద్ద అన్ని రకముల కేడియం బంగారు ఆభరణాలు సరసమైన ధరలకు లభిస్తాయని మొదటి 15 రోజులు ఆభరణాల చార్జీలు ఉండవని ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల యాదవ మహాసభ అధ్యక్షులు జాల చిన్న సత్తయ్య యాదవ్,కుప్ప రాములు గౌడ్, మాజీ సర్పంచ్ సయ్యద్ మియా, ఉప సర్పంచ్ పగిళ్ల లాలయ్య, రావుల సైదులు గౌడ్,జాల యాదయ్య,వెలుగు యాదయ్య, రావుల కొండలు గౌడ్,రావుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.