మేడారం మహా జాతరకు వెళ్లే భక్తులకు శుభవార్త

తొర్రూరు, జనవరి 21 ( జనం సాక్షి): మేడారం జాతరకు తొర్రూర్ నుంచి ఆర్టీసీ టికెట్ ధరలను అధికారులు ఖరారు చేశారు.తొర్రూరు డిపో నుండి 100 బస్సులు అందుబాటులో ఉంటాయి పెద్దలకు 360/-టికెట్ ధర పిల్లలకు 200/- వర్దన్నపేట నుండి పెద్దలకు 300/- పిల్లలకు 150/- ఉంటుంది ఇంటి వద్దకే మేడారం ప్రసాదం అవకాశం కల్పించిన టీజీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ వి. పద్మావతి తెలిపారు ఈనెల 25 నుంచి 31 వరకు ఆర్టీసీ బస్సులు మేడారం అమ్మవారి గద్దెల వరకు వెళతాయన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేడారం జాతరకు ఈ స్పెషల్ బస్సుల్లో కూడా మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ వర్తిస్తుందని,ఈ సదా అవకాశాన్ని తొర్రూర్ పరిసర ప్రాంతాల భక్తులు వినియోగించుకోవాలని కోరారు.
ఈ ధరలపై ఆర్టీసీ అధికారులు విస్తృత ప్రచారం చేపడుతున్నారు.


