జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. కొనసాగుతున్న పోలింగ్

నవంబర్ 10(జనంసాక్షి):జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఉదయం 9 గంటల వరకు 10.2 శాతం పోలింగ్ నమోదయింది. సాయంత్రం వరకు సమయం ఉండటంతో మందకోడిగా పోలింగ్ కొనసాగుతున్నది.



