జనంసాక్షి ఎగ్జిట్ పోల్స్‌లో జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌దే..
హైదరాబాద్ (జనంసాక్షి) : విశ్వసనీయతకు మారుపేరైన జనంసాక్షి సర్వే సంస్థ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. ఇందులోనూ కాంగ్రెస్ ముందంజలోనే ఉంది. ప్రచారం మొదలైన నాటినుంచి క్రమంగా ఓటర్లను కలుస్తూ వెళ్లిన నవీన్ యాదవ్.. పోలింగ్ నాటికి అనూహ్యంగా ఓటు బ్యాంకు కూడగట్టారు. దీంతో అప్పటివరకు హోరాహోరీగా అనిపించిన ఉప పోరు.. నవీన్ యాదవ్‌వైపు మొగ్గింది. అన్ని పోలింగ్ బూతుల్లో యువత ఎక్కువగా నవీన్ యాదవ్‌వైపే మద్దతుగా నిలిచారు. జనంసాక్షి నిర్వహించిన ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్‌లోనూ కాంగ్రెస్సే ఆధిక్యంలో ఉండగా.. ఆ పార్టీ అభ్యర్థి మొత్తంగా 10వేల నుంచి 15 వేల మెజారిటీ వరకు పెంచుకోగలిగారు. ఏడు డివిజన్లలో కాంగ్రెస్ ఆధిక్యం కనబడుతుండగా.. రెండు డివిజన్లలో మాత్రం బీఆర్‌ఎస్ గట్టి పోటీ ఇచ్చినట్టు సర్వేలో తేలింది. నవీన్ యాదవ్ గెలిస్తేనే జూబ్లీహిల్స్‌లో పురోగతికి అవకాశం ఉంటుందని ఓటర్లు భావించినట్టుగా అభిప్రాయం వ్యక్తమైంది.



