దేశాయి కుటుంబాన్ని పరామర్శించిన కవిత
ఎడపల్లి, (జనంసాక్షి) : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, న్యాయవాది వెంకటేశ్వర దేశాయి కుటుంబాన్ని మంగళవారం ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఇటీవల వెంకటేశ్వర దేశాయ్ కుమారుడు ప్రీతం దేశాయి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసింది. ఈ మేరకు నేడు ఎమ్మెల్సీ కవిత వెంకటేశ్వర దేశాయి, మున్సిపల్ మాజీ చైర్మన్ సునీత దేశాయితో పాటు కుటుంబ సభ్యులను పరామార్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.