కాంగ్రెస్ అభ్యర్థిపై ఖలిస్థానీ నేత ముందంజ

 

 

 

 

చండిఘర్ : ‘వారిస్‌ పంజాబ్‌ దే’ అతివాద సంస్థ అధిపతి అమృత్‌పాల్‌ సింగ్‌ ముందంజలో ఉన్నారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై అస్సాంలోని దిబ్రూగఢ్‌ జైల్లో ఉన్న ఆయన ఈ ఎన్నికల్లో పంజాబ్‌ లోని ఖడూర్‌ సాహిబ్‌ నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆతను కాంగ్రెస్‌ అభ్యర్థి కుల్బీర్‌ సింగ్‌ జీరాపై 45,424 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.