కొత్తగూడెంలో కేటీఆర్ పర్యటనను విజయ వంతం చెయ్యాలి

జనవరి 4 (జనం సాక్షి):ఈ నెల 7న భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో జరిగే కేటీఆర్ సభను విజయవంతం చేయాలని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమానికి హాజరవుతున్న కేటీఆర్ సభను విజయవంతం చేయాలన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో మనం అనుకున్న దానికంటే ఎక్కువ వస్తానని సర్పంచులుగా గెలుచుకున్నామని, అని అది జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ మాలో వర్గ పోరు వల్లే మాకు తక్కువ స్థానాలు వచ్చాయని ప్రచారం చేసుకుంటున్నారని అది ముమ్మాటికి అసత్యమన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రతి గ్రామంలో కార్యకర్తలు బలమైన కేడర్ ఉందని అన్నారు. అదే స్ఫూర్తితో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్నారు. కొత్తగూడెం, ఇల్లందు, అశ్వరావుపేట మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కొత్తగూడెం కార్పొరేషన్ అయినందున 60 డివిజన్లు మనమే సొంతం చేసుకోవాలని అన్నారు. ఈ సన్నాహాక సమావేశంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు మచ్చ నాగేశ్వరరావు హరిప్రియ, భద్రాచలం ఇంచార్జ్ మానే రామకృష్ణ. రావులపల్లి రాంప్రసాద్. మాజీ గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మి. బీఆర్ఎస్ జిల్లా నాయకురాలు సింధు తపస్వి, మాజీ ఎంపీపీ శాంతి, అన్వర్ పాషా ఉద్యమకారులు పాల్గొన్నారు.


