ఎండి మునీర్ ఆరోగ్యం విషమం

MD Munir’s health is deteriorating
హైదరాబాద్, మే 18 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమకారుడు, సింగరేణి సకల జనుల సమ్మె కన్వీనర్, సీనియర్ జర్నలిస్ట్ ఎండి మునీర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం మంచిర్యాలలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మునీర్ అనారోగ్యం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీమంత్రి కేటీఆర్ స్పందించాలని, మెరుగైన చికిత్స అందించేందుకు చొరవ తీసుకోవాలని పలువురు మేధావులు కోరుతున్నారు.