వినాయక పూజలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ బ్యూరో,సెప్టెంబర్ 8, (జనం సాక్షి)
నల్లగొండ పట్టణంలో పలు వినాయక మండపాల వద్ద పూజా కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు.వార్డుల్లో 40 వార్డు సావర్కర్ నగర్,28 వార్డ్-హునుమాన్ నగర్,47 వార్డ్-బోయవాడ,విద్యానగర్,నల్లగొండలో ఏర్పాటు చేసిన పలు వినాయక విగ్రహం వద్ద జరిగిన పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.