ఎంపీటీసీ భారతమ్మ గోపాల్ కు ఘనంగా సన్మానం

వలిగొండ జూలై 06 ( జనం సాక్షి) : మండల పరిధిలోని టేకుల సోమారం గ్రామ ఎంపీటీసీ చేగూరి భారతమ్మ గోపాల్ లా పదవి విరమణ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పడమటి మమత, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు టేకుల సోమారం ఎంపీటీసీగా ప్రజాసేవ చేసిన చేగూరి భారతమ్మ గోపాల్ కు శుభాకాంక్షలు తెలిపారు.పదవికే వన్నె తెచ్చే వ్యక్తిత్వం వారిదని కొనియాడారు. జీవితంలో మరెన్నో ఉన్నత అవకాశాలు అందిపుచ్చుకోవాలని అన్నారు. ఎంపిటిసి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం నా అదృష్టం అని, ఎంపీటీసీ నిధులు తెచ్చి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశానని అన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరించిన పడమటి మమతా నరేందర్ రెడ్డికి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు చేగూరి జంగయ్య గ్రామ నాయకులు యువత గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.